డీలిమిటేషన్ బిల్లుపై పాకిస్థాన్ వ్యాఖ్యలు... స్పందించిన భారత్

  • డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు పాక్ ప్రకటన
  • భారత్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని స్పష్టీకరణ
  • పరిపాలనా, శాసనపరమైన ప్రక్రియలు భారత సార్వభౌమత్వానికి సంబంధించినదని వెల్లడి
లోక్ సభలో తీసుకొచ్చిన డీలిమిటేషన్ బిల్లుపై పాకిస్థాన్ చేసిన వ్యాఖ్యలను భారత్ తోసిపుచ్చింది. భారత అంతర్గత వ్యవహారాల్లోకి బయటివారు జోక్యం చేసుకోవద్దని హెచ్చరించింది. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టేందుకు ఎన్నికల సంఘానికి అధికారం కల్పించే ఒక నిబంధన డీలిమిటేషన్ బిల్లు 2026లో ఉంది. ఈ నిబంధనపై పాకిస్థాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్ ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తాహిర్ ఆంద్రాబీ పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో ఇతరులు జోక్యం చేసుకుంటే భారత్ అంగీకరించదని స్పష్టం చేశారు. దేశంలోని పరిపాలనా, శాసనపరమైన ప్రక్రియలకు సంబంధించిన నిర్ణయాలు సార్వభౌమత్వానికి సంబంధించినవని అన్నారు. వీటిలో ఇతర దేశాల జోక్యం అవసరం లేదని అన్నారు.

India
Pakistan
Delimitation Bill
Jammu and Kashmir
LoK Sabha
Randhir Jaiswal
Pakistan Foreign Ministry

More Telugu News